జనాభా లెక్కింపు సహా జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)పై చర్చించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ నేతృత్వంలో భేటీ జరగనుంది.
ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, జనగణన డైరెక్టర్లు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిర్వహించనున్న జనాభా లెక్కింపు విధివిధానాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
'మేం రాం'
అయితే ఈ సమావేశంలో తమ రాష్ట్ర అధికారులు పాల్గొనరని బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఇదివరకే ప్రకటించారు. బంగాల్తో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఎన్పీఆర్ అమలును వ్యతిరేకిస్తున్నాయి. జాతీయ పౌర పట్టిక రూపొందించడానికి తొలి దశ ఎన్పీఆరేనని ఆరోపిస్తున్నాయి.