తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసు ఎన్​ఐఏకు బదిలీ

కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ)కు అప్పగించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్మగ్లింగ్ వల్ల​ జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందువల్ల ఈ కేసును ఎన్​ఐఏకు బదిలీ చేసినట్లు పేర్కొంది.

MHA allows NIA to probe Thiruvananthapuram airport gold smuggling case: Official.
కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసు ఎన్​ఐఏకు బదిలీ

By

Published : Jul 9, 2020, 9:37 PM IST

కేరళ బంగారం స్మగ్లింగ్‌ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) చేతికి వెళ్లింది. ఈ మేరకు ఎన్​ఐఏకు అనుమతి మంజూరు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బంగారం స్మగ్లింగ్‌.. జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటం వల్ల ఈ కేసును ఎన్​ఐఏకు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. గతవారం గల్ఫ్‌ నుంచి ఎయిర్‌ కార్గో ద్వారా వచ్చిన దౌత్య పార్శిల్‌లో 15 కోట్లు విలువ చేసే 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

ఈ వ్యవహారంతో సీఎంవో అధికారికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావటం వల్ల..సీఎం పినరయి విజయన్‌ నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేశ్‌కు సీఎం కార్యాలయం ప్రిన్సిపల్‌ కార్యదర్శి శివశంకర్‌ సహకరించినట్లు ఆరోపణలు రావటం వల్ల ఆయన్ను పదవి నుంచి తప్పించారు.

ఇదీ చూడండి:'మహా' విజృంభణ: కొత్తగా 6,875 కేసులు, 219 మరణాలు

ABOUT THE AUTHOR

...view details