తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి కార్డుపై 'ఓటు' ప్రచారం - రామ్​లాల్ ప్రసాద్​

ఎన్నికల వేళ ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు సాధారణం. బిహార్​లో ఓ పోలీస్​ మాత్రం వినూత్నంగా ఓటు హక్కు వినియోగానికి ప్రచారం చేస్తున్నారు.

పెళ్లి కార్డుపై 'ఓటు' ప్రచారం

By

Published : Mar 2, 2019, 7:03 AM IST

పెళ్లి కార్డుపై 'ఓటు' ప్రచారం

రామ్​లాల్ ప్రసాద్​.... బిహార్​లోని తూర్పు చంపారన్ మోతీహరిలో పోలీసుగా పని చేస్తున్నారు. ఈయన్ను అంతా ట్రీమ్యాన్​ అని పిలుస్తారు. ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమే ఇందుకు కారణం.

ఈ నెల 6న రామ్​లాల్​ పెళ్లి. వివాహ పత్రికలో ముహూర్తం, కల్యాణ మండపం వివరాలు మాత్రమే ఇచ్చి సరిపెట్టలేదు రామ్​లాల్​. ఓటు హక్కు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజెప్పారు.

"యువత జీవితంలో ముఖ్యమైన విషయాలు మూడు. అవి చదువు, పని, ఓటు. ఈ మూడు విషయాల్లో ఓటు చాలా ముఖ్యం."అని పెళ్లి కార్డుపై ముద్రించారు.

"ఓటు హక్కుపై అవగాహన కోసం చాలా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సార్లు చూశాను. అప్పుడు నా మనస్సుకు అనిపించింది నేనెందుకు అలా ప్రచారం చేసి అవగాహన కల్పించకూడదని. వినూత్నంగా ఈ పని నిర్వహించాలని నిర్ణయించుకున్నా. త్వరలో నా వివాహం. ఆ వివాహ పత్రికలో ఓటు హక్కు గురించి ఒక సందేశం ముద్రించాను."
-రామ్​లాల్​ ప్రసాద్​, బిహార్​ పోలీస్

ABOUT THE AUTHOR

...view details