బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు.. నీళ్ల మధ్య చిక్కుకుపోయారు. కర్ణాటక రాయచూరు జిల్లా మస్కిలో జరిగిందీ సంఘటన.
బహిర్భూమికి వెళ్లి నీళ్ల మధ్యే చిక్కుకున్నారు ఏమైంది?
చెన్నబసవ, జలీల అనే ఇద్దరు వ్యక్తులు మస్కి నాలా రిజర్వాయర్ వద్ద బహిర్భూమికి వెళ్లారు. ఇంతలో ప్రవాహం ఉద్ధృతమైంది. తిరిగిరావడానికి వీలు లేనంతగా మారింది. ఓ గట్టును ఆసరాగా చేసుకొని ఇరువురూ అక్కడే ఉండిపోయారు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు.
మస్కి నాలా వద్ద భారీగా వర్షం కురిసింది. ఉదయం 3 గంటల ప్రాంతంలో 200 క్యూసెక్కుల నీటి ప్రహవాం కొనసాగింది. నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉదయం 8 గంటలకల్లా నీటి ప్రవాహం.. 1,600 క్యూసెక్కులకు చేరింది.
ఇదీ చూడండి:'నన్ను క్షమించండి... మీ దుకాణంలో దొంగతనం చేశాను'