భాజపా సంకల్ప్ యాత్రలో భాగంగా బిహార్ రాజధాని పట్నాకుఆదివారంవెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనపై అభిమానంతో అర చేతులపై కమలం, 'నమో సంకల్ప్' అని గోరింటాకు రాసుకుని వినూత్నంగా స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు స్థానిక మహిళలు. మోదీనే మళ్లీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారు.
అరచేతిపై 'నమో' మంత్రం - మోదీ
పట్నాలో ఆదివారం పర్యటించనున్న ప్రధాని నరేంద్రమోదీకి వినూత్నంగా స్వాగతం పలికేందుకు కొందరు మహిళలు సంకల్పించారు. అరచేతులపై మెహందీతో కమలం, నమో సంకల్ప్ అని రాసుకుని అభిమానాన్ని చాటుకుంటున్నారు.
"భరతమాత బిడ్డ, మన ప్రధాని నరేంద్రమోదీ పట్నాకు ఆదివారం రానున్నారు. మేమంతా ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసుకున్నాం. నమో సంకల్ప్ అని రాసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించాం. ఇక్కడ సంకల్ప్ అంటే మరోసారి ప్రధానిగా మోదీనే గెలవాలని సంకల్పించుకున్నాం. ఆయన చేతుల్లోనే దేశం సురక్షితంగా ఉంటుందని మా నమ్మకం. అభినందన్‌ను ఎలా వెనక్కి రప్పించారో చూస్తే ఆయన కన్నా మంచి ప్రధాని ఇంకొకరు ఉండరని అర్థమవుతుంది. అవకాశం లభిస్తే మోదీకి మా అభిమానాన్ని చూపిస్తాం."
-పట్నా నివాసి