రూపాయికే టిఫిన్.. రూ.5కే భోజనం.. కారణం ఇదే! కేవలం రూపాయికే ఇడ్లీ, ఐదు రూపాయలకే భోజనం అందిస్తూ విద్యార్థులు, దివ్యాంగుల కడుపు నింపుతున్నారు తమిళనాడు తిరుచ్చికి చెందిన పుష్పమ్మ, చంద్రశేఖరన్ దంపతులు. 'పుష్పమ్మ హోటల్' పేరుతో సంవత్సరం నుంచి అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు .
ఎక్కువ మంది విద్యార్థులే...
తిరుచ్చి రేస్‌కోర్స్ రోడ్డులోని ప్రభుత్వ కాలేజీ పక్కనే హోటల్ ఉండటం వల్ల పేద విద్యార్థులు రోజూ ఇక్కడే టిఫిన్, భోజనం చేస్తారు. ఈ హోటల్లో దక్షిణ భారత వంటకాలన్నీ అతి తక్కువ ధరకే లభిస్తాయి.
ఆ విద్యార్థి విజ్ఞప్తితో...
చంద్రశేఖరన్ వెల్డర్‌గా పనిచేస్తున్నారు. వెల్డింగ్ పనిలో వచ్చిన డబ్బును హోటల్ నిర్వహణకు ఉపయోగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నా.. తన సంపాదనను హోటల్ నిర్వహణకే కేటాయిస్తున్నారు చంద్రశేఖరన్. ఖర్చులను భరిస్తూ అతి తక్కువ ధరకే పేద విద్యార్థులు, దివ్యాంగుల కడుపు నింపుతున్నారు.
" మేం ఇంతకు ముందు రూ. 20 రూపాయలకు భోజనం అమ్మేవాళ్లం. రోజూ హోటల్‌ను మూసివేసేటప్పుడు మిగిలిన వంటలను పడేసేవాళ్లం. ఇది గమనించిన ఓ విద్యార్థి తనకు తక్కువ ధరకే భోజనం పెట్టమని కోరాడు. అప్పటి నుంచి అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపాలని నిశ్చయించుకున్నాం."
--పుష్పమ్మ, హోటల్ యజమాని
ఇదీ చదవండి :శ్మశానంలో బారసాల.. ఎందుకో తెలుసా?