కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ షామ్లీలోని మురికివాడల్లో నమూనాలు సేకరించేందుకు వైద్య నిపుణుల బృందం పర్యటిస్తోంది. డా. మీనాక్షి ధీమాన్ నేతృత్వంలోని బృందం.. ధేవా బస్తీ సిటీ బ్లాక్ రోడ్డు వద్ద నమూనాలు తీసుకుంటుండగా.. అర్వింద్ అనే యువకుడు హల్చల్ చేశాడు.
కరోనా సాంపిల్స్ కోసం వెళ్లిన సిబ్బందిపై దాడి - hindrance
ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లీ ప్రాంతంలో వైద్య బృందంపై ఓ యువకుడు దాడి చేశాడు. మురికివాడల్లో కరోనా కట్టడి కోసం నమూనాలు సేకరిస్తుండగా.. అర్వింద్ అనే వ్యక్తి వారితో దురుసుగా ప్రవర్తించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వైద్య బృందంపై దాడి
వారితో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా.. పనికి పదే పదే ఆటంకం కలిగించాడు. ఆపేందుకు ప్రయత్నించిన వైద్య బృందంలోని డ్రైవర్‌పై కర్రతో దాడికి దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ.. అప్పటికే దుండగుడు పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:కాళ్లు, చేతులకు బేడీలతో 10 కి.మీ ఈత