సంఘ సంస్కర్తలు, గురువులు, గొప్ప నాయకుల సందేశాలు, విలువలు ప్రజలకు తెలిసేందుకే వీటిని నిర్మించామన్నారు. అంతేకానీ, తన పార్టీ గుర్తు ప్రచారానికి కాదని అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన ప్రమాణపత్రంలో పేర్కొన్నారు మాయావతి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు.
'జనాకాంక్షలకు ఆ విగ్రహాలే ప్రతిరూపాలు' - BSP
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు విగ్రహాలు, స్మారక స్థూపాలు ఏర్పాటు చేయటంపై సుప్రీంకు వివరణ ఇచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకే వీటిని నిర్మించామని, నిధుల కేటాయింపు ప్రభుత్వ నియమాలకు అనుగుణంగానే జరిగిందని అఫిడవిట్లో పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్ష మేరకే విగ్రహాల ఏర్పాటు
" విగ్రహాలు, స్మారక స్థూపాల ఏర్పాటును ప్రజలు కోరుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే మా ప్రభుత్వం నడుచుకుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే వీటి నిర్మాణం, ప్రారంభానికి నిధుల కేటాయింపు జరిగింది. కోర్టును తప్పుదోవ పట్టించడానికే నాపై వ్యాజ్యం వేశారు "
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి
ఇదీ చూడండి :ఢాబాలో రాహుల్ భోజనం... హేమకు కోపం
Last Updated : Apr 2, 2019, 4:45 PM IST