బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కుటుంబ సభ్యులకు పార్టీలోని కీలక పదవులను అప్పగించారు. సోదరుడు ఆనంద్ కుమార్ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. మేనల్లుడు ఆకాశ్ ఆనంద్కు జాతీయ కోఆర్డినేటర్ పదవిని అప్పగించారు మాయ.
ఆదివారం ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో జరిగిన పార్టీ సమావేశంలో మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఈ సమావేశానికి పార్టీ పెద్దలు హాజరయ్యారు.