బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతిబుధవారం సంచలన ప్రకటన చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు.
"ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికల్లో నేను పోటీ చేయాలని అనుకోవట్లేదు. పార్టీ కూడా అంగీకరించింది. నేను పోటీ చేస్తే... ఆ ప్రభావం మిగతా స్థానాల ఎన్నికలపై పడుతుంది. పార్టీకి, మా ఉద్యమానికి ఎలాంటి నష్టం జరిగేందుకు ఒప్పుకోను. అందుకే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయను. ఈ ఎన్నికల తర్వాత అవసరమైతే ఏ స్థానాన్నైనా ఖాళీ చేయించి పోటీ చేయగలను. అందులో నాకెలాంటి సమస్య లేదు."
-మాయావతి, బీఎస్పీ అధినేత్రి