జైషే మహ్మద్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంపై భాజపా, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ వల్లే ఈ ఘనత సాధ్యమైందని భాజపా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో విపక్షాల తీరును తప్పుపట్టింది. పదేళ్ల శ్రమకు గుర్తింపు లభించినప్పటికీ... ఈ ఘనతను విపక్షాలు చిన్నది చేసి చూస్తున్నాయని ఆరోపించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.
"మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం దేశానికి, దేశ దౌత్య నీతికి సంబంధించి ఎంతో పెద్ద విజయం. దేశం గెలిచినప్పుడు... భారతీయులు గెలుస్తారు. కానీ ఈ విజయంలో భాగస్వాములైతే రాజకీయంగా నష్టపోతామని విపక్షాలు అనుకుంటున్నాయి."
-- అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి