తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చమురు బావిలో మంటల ధాటికి ఇద్దరు మృతి - అసోం చమురు బావి ఘటన

అసోంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన ఆయిల్​ ఇండియా లిమిటెడ్​ చమురు బావిలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు. మరోవైపు ఘటనాస్థలం నుంచి రెండు మృతదేహాలను వెలికితీసింది ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం.

Massive fire at Baghjan oil field creates panic, two employees of Oil missing
చమురు బావిలో తగ్గని మంటలు.. ఇద్దరు మృతి

By

Published : Jun 10, 2020, 11:49 AM IST

Updated : Jun 10, 2020, 12:14 PM IST

తూర్పు అసోంలోని ఓ చమురు బావిలో మంటలు చెలరేగిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. వీరి మృతదేహాలను ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం వెలికితీసింది.

అసోం టిన్సుకియా జిల్లాలోని భాగ్​జన్ వద్ద ఉన్న ఆయిల్​ ఇండియా లిమిటెట్​ చమురు బావిలో మంగళవారం చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అగ్నికీలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. పరిస్థితిని అదుపుచేసేందుకు ఎన్​డీఆర్​ఎఫ్​ బృందంతో పాటు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

చమురు బావిలో అదుపులోకి రాని మంటలు

స్థానికులను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు 50 నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి. మే 27 నుంచి గ్యాస్​ లీక్​ అవుతోందని, ఇప్పటికే అనేక చేపలు, పక్షులు, జంతువులు మరణించాయని స్థానికులు తెలిపారు.

మరోవైపు రాష్ట్ర పారిశ్రామిక మంత్రి చంద్రమోహన్​ పటోవరి బుధవారం ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు.

Last Updated : Jun 10, 2020, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details