తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: 8వ అడుగు ఓటు వైపు! - ఓటు

సాధారణంగా పెళ్లిలో ఏడు ప్రమాణాలతో ఏడడుగులు వేస్తారు వధూవరులు. ఉత్తరప్రదేశ్​లో కొన్ని జంటలు ఎనిమిదో ప్రమాణంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రమాణం చేశాయి.

కాన్పూర్​లో సామూహిక వివాహాలు

By

Published : Apr 5, 2019, 8:02 PM IST

కాన్పూర్​లో సామూహిక వివాహాలు
ఓటు హక్కును బాధ్యతగా స్వీకరిస్తామని నూతన వధూవరులు అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. మూడు ముళ్ల బంధంతో ఏకమైన కొత్త జంటలు.. ఓటుపై అందరికీ అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని వాగ్దానం చేశాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్​లో ఆదివాసీ కల్యాణ్ సంఘ్ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక వివాహాలు ఇందుకు వేదికయ్యాయి.

" ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 29న ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి. ఇందులో భాగంగా మేం ప్రమాణం చేస్తున్నాం. ముందు ఓటు.. ఆ తర్వాతే అన్నపానీయాలు. వివాహ వేడుకల్లో 7 ప్రమాణాలు ఉంటాయి. ఎనిమిదో ప్రమాణం ఓటు వినియోగమే."
-ఆదివాసీ సంక్షేమ సంఘం ప్రతినిధి

వధూవరులకు కానుకలను కూడా అందజేశారు నిర్వాహకులు. ప్రతి ఒక్కరికీ మంచాలు, బీరువాలు, పాత్రలు బహూకరించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details