తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మమ్మల్ని చంపేందుకు కుట్ర: రైతు నాయకులు

ఈ నెల 26న ట్రాక్టర్​ ర్యాలీని భగ్నం చేసే ఉద్దేశంతో తమను చంపేందుకు కుట్ర జరుగుతోందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కుట్రలో భాగమైన ఓ వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

plot to shoot 4 farmer leaders
మమ్మల్ని చంపేందుకు కుట్ర.. ఇదిగో సాక్ష్యం: రైతులు

By

Published : Jan 23, 2021, 8:04 AM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్న తమను చెదరగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. ఇందులో భాగంగానే తమపై హత్యాయత్నానికి యత్నిస్తున్నారని తెలిపారు. ఈ నెల 26న ​ నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీని భగ్నం చేసేందుకు తమలో నలుగురిపై కాల్పులు జరపాలనే కుట్ర జరిగిందని రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఈ కుట్రలో భాగమైన ఓ వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ముసుగులో ఉన్న సదరు వ్యక్తి.. ఈ కుట్ర గురించి విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించాడు. తాము మొత్తం 10 మంది ఉన్నట్లు తెలిపాడు. ఈ నెల 26న జరిగే ట్రాక్టర్​ ర్యాలీని భగ్నం చేసేందుకు 90 శాతం అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. దీని గురించి సమాచారాన్ని లీక్​ చేస్తే తమ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించినట్లుగా వెల్లడించాడు.

మమ్మల్ని చంపేందుకు కుట్ర.. ఇదిగో సాక్ష్యం: రైతులు

"జనవరి 26న జరిగే ర్యాలీలో మాలో సగం మంది పోలీసుల యూనిఫామ్​ ధరించి రైతులను చెల్లాచెదురు చేస్తారు. ఎవరిని కాల్చాలో వారి ఫొటోలు కూడా మాకు అందాయి. మా వెనకాల ఉన్నది ఓ పోలీసు అధికారే. మేం డబ్బుల కోసమే ఈ పని చేసేందుకు అంగీకరించాం. దయచేసి ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులకు తెలియజేయవద్దు. దీని కోసం మాకు తలో రూ.10,000 ముట్టాయి. ఈ ర్యాలీని చెదరగొట్టేందుకు వచ్చే వ్యక్తులు ఎలా ఉంటారో కూడా నేను వివరించాను. ఈ పథకంలో ఆయధాలు సరఫరా చేయడమే నా పని. హరియాణా సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్​ ర్యాలీలోనూ పోలీసు యూనిఫామ్​ ధరించి లాఠీ ఛార్జ్​ చేయాలని మాకు ఆదేశాలు ఉన్నాయి. మాకు వివిధ, హోటళ్లు, దాబాల్లో దీనికోసం శిక్షణ అందుతుంది."

-- ముసుగు ధరించిన వ్యక్తి

అనంతరం ఆ ముసుగు ధరించిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు రైతు సంఘాల నాయకులు.

ఇదీ చూడండి:వీడని ప్రతిష్టంభన- ఉద్యమం మరింత ఉద్ధృతం!

ABOUT THE AUTHOR

...view details