తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకేసారి 60 ముస్లిం వివాహాలు - MASS MARRIAGES

బిహార్​లో జరిగిన సామూహిక వివాహ వేడుకలో 60 ముస్లిం జంటలు ఒక్కటయ్యాయి. దేశంలో ముస్లింలకు ఇలాంటి వివాహ కార్యక్రమం ఎన్నడూ జరగలేదని నిర్వాహకులు తెలిపారు.

ఒకేసారి 60 ముస్లిం వివాహాలు

By

Published : Mar 20, 2019, 5:33 AM IST

ఒకేసారి 60 ముస్లిం వివాహాలు
సాధారణంగా వివాహమంటే భారీ ఖర్చు తప్పదు. అయితే వివాహ వేడుకల ఖర్చు భరించలేని పేదవారు దేశంలో ఎంతో మంది ఉన్నారు. వీరికి ఐఎస్​ఎస్​ఏ ఫౌండేషన్​ అండగా నిలుస్తోంది. పెళ్లి ఖర్చు తగ్గించేందుకు సామూహిక వివాహాలు నిర్వహిస్తోంది.

బిహార్​లోని సహర్సా జిల్లాలో సోమవారం ఒకే వేదికపై సామూహిక వివాహ వేడుక నిర్వహించింది ఈ సంస్థ. వందలాది మంది సమక్షంలో 60 ముస్లిం వివాహాలు ఘనంగా జరిగాయి.

దేశంలో ఇంతమంది ముస్లిం జంటలకు ఒకే వేదికపై సామూహిక వివాహ వేడుక జరగడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు తెలిపారు.

"ఇలాంటి కార్యక్రమాలు గుజరాత్​లో గత ఐదారేళ్లుగా నిర్వహిస్తున్నాం. ఇకనుంచి బిహార్, అసోం, బంగాల్ రాష్టాల్లోనూ నిర్వహిస్తాము."

-మౌలానా హమిద్ అహ్మద్​, ఇస్సా ఛైర్మన్​

భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలకు వివాహ వేడుక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు మౌలానా. ఈ వేడుకకు హాజరైన వందలాది మందికి భోజన ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఒక్కటైన నూతన జంటలకు కానుకగా ఇంటి సామాన్లనూ బహూకరించారు.

"పెళ్లి వేడుక చేసుకునే స్తోమత లేని పేదవారి కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.నా వినతిని మన్నించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఛైర్మన్​కు ధన్యవాదాలు"

-వేడుక నిర్వాహకులు

ABOUT THE AUTHOR

...view details