తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అవతరణ దినోత్సవం వేళ మావోల దుశ్చర్య

మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నక్సల్స్ దాడులకు తెగబడ్డారు. గడ్చిరోలి జిల్లా కుర్ఖేడాలో రెండు రహదారి పనుల కార్యాలయాలకు, వాహనాలకు నిప్పు పెట్టారు. కస్నూర్​ ఎన్​కౌంటర్​కు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ దాడి చేశామని బ్యానర్​ ఉంచి వెళ్లారు.

అవతరణ దినోత్సవం వేళ మావోల దుశ్చర్య

By

Published : May 1, 2019, 11:10 AM IST

Updated : May 1, 2019, 3:11 PM IST

మహారాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. గడ్చిరోలి జిల్లా కుర్ఖేడాలో 36 వాహనాలకు నిప్పు పెట్టారు. రెండు కార్యాలయాల్ని తగలబెట్టారు. ఈ ఘటనలో 15 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా.

రెండు కార్యాలయాలు సహా 27 వాహనాలు, జనరేటర్లు, రెండు జేసీబీలు, ఒక డాంబర్ డిస్పెన్సర్, డీజిల్, గ్యాసోలిన్ ట్యాంకర్లు, పెద్ద రోడ్డు రోలర్లు అగ్నికి ఆహుతయ్యాయి.

ఫరీద్-మాలేగావ్-యేర్కడ్​ 136 నెంబర్ జాతీయ రహదారిపై అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తోంది. ఆ సంస్థకు దాదాపూర్ వద్ద రహదారి నిర్మాణానికి సంబంధించి రెండు కార్యాలయాలున్నాయి.

ఈ కార్యాలయాలు, నిలిచి ఉన్న వాహనాలకు, తారు తయారీ యంత్రానికి 150 మంది మావోయిస్టులు సాయుధులుగా వచ్చి నిప్పు పెట్టారు. కస్నూర్ ఎన్​కౌంటర్, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ దాడి చేశామని బ్యానర్​ను ఉంచి వెళ్లారు మావోలు.

ఇదీ చూడండి: సైకిల్​ రేసు మధ్యలో కుక్క పిల్ల..!

Last Updated : May 1, 2019, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details