ప్లాస్టిక్ వాడకం వల్ల భూతాపం పెరిగిపోతుండడంతో ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ పదార్థాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషించిన ఈ సంస్థ పిండి పదార్థాలతో ప్రయోగం చేసి సఫలీకృతమయ్యింది. భోజనం చేసేందుకు వినియోగించే చెంచాలు, ఫోర్క్లు, కూర, భోజనం వడ్డించుకునే చెంచాలు, కేకు కట్ చేసేందుకు కత్తి వంటి వాటిని పిండి పదార్థాలతో తయారు చేస్తోంది.
ప్లాస్టిక్ రహితంగా పర్యావరణ హిత చెంచాల తయారీ..! - gujarath
పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపుతోంది గుజరాత్‌లోని పరిశ్రమల అభివృద్ధి సంస్థ. చిరుధాన్యాల పిండితో చెంచాలు, భోజనానికి వినియోగించే చిన్న చిన్న వస్తువులను తయారు చేస్తోంది. వీటి ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని చెబుతోంది.
ప్లాస్టిక్ రహితంగా పర్యావరణ హిత చెంచాల తయారీ..!
పిండితో తయారు చేయడం వల్ల చెంచాల వినియోగానంతరం వాటిని కూడా తినొచ్చని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. 'ప్లాస్టిక్ చెంచాలను విడిచిపెట‌్టండి... సహజమైన చెంచాలనే వాడండి' అంటూ ఈ సంస్థ వినూత్న ప్రచారం చేస్తోంది.
ఇదీ చూడండి: భూటాన్లో కూలిన భారత హెలికాప్టర్- ఇద్దరు పైలట్లు మృతి
Last Updated : Oct 2, 2019, 7:30 AM IST