తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మన్మోహన్ కోసం అమెరికా నుంచి మోదీ ట్వీట్ - pm greets manmohan

భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్​ నేత మన్మోహన్​ సింగ్​కు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన్మోహన్​ సింగ్​ ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు.

మన్మోహన్​ సింగ్​

By

Published : Sep 26, 2019, 2:26 PM IST

Updated : Oct 2, 2019, 2:20 AM IST

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గురువారం 87వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానిగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్​ ద్వారా మన్మోహన్​సింగ్​కు శుభాకాంక్షలు తెలిపారు.

మోదీ ట్వీట్

"మన్మోహన్‌ జీ మీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్..

రాజ్​నాథ్ ట్వీట్

"మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను."

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

సోనియా గాంధీ...

"మన్మోహన్​ సింగ్​కు 87వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో భారత్​ ఎన్నో మైలు రాళ్లు దాటింది. ప్రస్తుత నాయకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి."

-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

ఇదీ చూడండి: రాబర్ట్​ వాద్రాను కస్టడీకి అప్పగించండి: ఈడీ

Last Updated : Oct 2, 2019, 2:20 AM IST

ABOUT THE AUTHOR

...view details