ఉత్తరప్రదేశ్లో ప్రేమకోసం మరో ప్రాణం బలయింది. ముజఫర్నగర్ జిల్లా జరోడాలో సొంత చెల్లినే పొట్టనబెట్టుకున్నాడు ఓ యువకుడు. తనకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమిస్తుందన్న కారణంగా సోదరితో వాదనకు దిగాడు ఆశిష్ అనే వ్యక్తి. ఇద్దరి మధ్య మాటలు పెరిగిపోవటం వల్ల ఆగ్రహానికి గురైన ఆశిష్ సోదరిని కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
ప్రేమించిందని చెల్లినే కడతేర్చిన యువకుడు
తనకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించినందుకు సొంత చెల్లినే కిరాతకంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ దుర్ఘటన ఉత్తర్ప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రేమించిందని చెల్లినే కడతేర్చిన యువకుడు
తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.
ఇదీ చూడండి:'కశ్మీర్'సంబంధిత పిటిషన్లపై సుప్రీం విచారణ వాయిదా
Last Updated : Sep 27, 2019, 6:02 AM IST