కన్న కొడుకు.. తల్లిదండ్రులను ఇనుపరాడ్‌తో కొట్టి చంపేసిన హేయమైన ఘటన కర్ణాటక కొప్పల్ జిల్లా కనకగిరి పట్టణంలో జరిగింది.
నిందితుడు రమేశ్ మాడివాలార్ భార్య పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చేందుకు రమేశ్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో రమేశ్.. అతని తల్లిదండ్రులు అక్కమ్మ, గిరియప్పలతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయిన రమేశ్.. ఇనుపరాడ్డుతో తల్లిదండ్రులపై దాడి చేశాడు. తల్లి అక్కమ్మ అక్కడికక్కడే చనిపోగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తండ్రి గిరియప్ప మరణించాడు.