తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరెంట్ బిల్లు కోసం గొడవ- పెట్రోల్​ పోసి దారుణం - మహారాష్ట్ర నేరవార్తలు

ఒకే అపార్ట్​మెంట్​లో నివసిస్తోన్న ఇద్దరు మహిళల మధ్య గొడవ ఓ వ్యక్తి మృతికి కారణమైంది. తన తల్లితో గొడవ పెట్టుకున్న మహిళపై ఆగ్రహించిన నిఖిల్​.. ఆమె తండ్రిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన మహారాష్ట్ర ఠాణే జిల్లాలోని దోనేవాడిలో జరిగింది.

MH CRIME
గొడవ

By

Published : Sep 18, 2020, 7:59 AM IST

మహారాష్ట్ర ఠాణే జిల్లా దోనేవాడిలో దారుణం జరిగింది. ఒకే అపార్ట్​మెంట్​లో నివసిస్తోన్న ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి శరీరంపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నిఖిల్​ గౌరవ్​ను అరెస్టు చేశారు. మృతుడిని చంద్రకాంత్ పవార్​గా గుర్తించారు.

ఏం జరిగింది..

చంద్రకాంత్ పవార్ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి దోనేవాడిలోని విశ్వనాథ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. పది రోజుల క్రితం, విద్యుత్​ బిల్లు వసూలు చేయటానికి గౌరవ్​ ఇంటికి పవార్ కుమార్తె వెళ్లింది. ఈ విషయంలో ఆమెకు గౌరవ్​ తల్లి మధ్య గొడవ జరిగింది. ఇరుగుపొరుగు నచ్చజెప్పటం వల్ల ఆ గొడవ సద్దుమణిగింది.

అయితే, సెప్టెంబర్ 10న నిఖిల్ గౌరవ్​ మద్యం సేవించి పవార్ ఇంటికి వచ్చి మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పవార్​పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన పవార్​.. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు వదిలాడు.

ఇదీ చూడండి:'మహా'పై కొవిడ్​ విధ్వంసం-కొత్తగా 24,619 కేసులు

ABOUT THE AUTHOR

...view details