సాంకేతికతతో ప్రపంచం ఎంతో ముందుకు వెళుతోంది. కానీ ఆ వెంటే వస్తున్న కాలుష్య భూతం కారణంగా జీవవైవిధ్యం దెబ్బతింటోంది. పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పిచ్చుకలు కనిపించే పరిస్థితులు లేవు. ఆ చిన్ని పక్షులను రక్షించాలని సంకల్పించుకున్నాడు ఓ వ్యక్తి.
శరవణన్... తమిళనాడు నాగపట్టణం వాసి. 'విళుతు ఐయ్యక్కమ్' పేరిట సామాజిక సంస్థ నిర్వహిస్తారు. పిచ్చుకల సంరక్షణకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.