తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ కుటుంబంతో హార్న్​బిల్ 'అరుదైన స్నేహం'

మనిషి, పక్షుల మధ్య స్నేహం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. అరుదైన హార్న్‌బిల్‌ పక్షి కర్ణాటకలోని ఓ కుటుంబంలో భాగమైపోయింది. అందరితో చనువుగా ఉంటూ ఆ కుటుంబంతో అనుబంధాన్ని ఏర్పర్చుకుంది. అంతరించిపోయే దశలో ఉన్న హార్న్‌బిల్‌.. ఓ కుటుంబంతో మమేకమవటం స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది.

Man-Avian bond
హార్న్​బిల్

By

Published : Aug 19, 2020, 1:53 PM IST

మనుషులు, వన్యప్రాణుల మధ్య స్నేహం ఎప్పుడూ ప్రత్యేకంగానే నిలుస్తుంది. కర్నాటక కార్వార్ జిల్లాలోని హొన్నకేరి గ్రామంలో ఇలాంటి బంధం మనకు కనపడుతుంది. హొన్నకేరిలో నివసించే కృష్ణానంద శెట్టి ఇంటికి అరుదైన హార్న్‌బిల్ పక్షి రోజూ మూడు సార్లు వస్తోంది. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ హార్న్‌బిల్‌ తప్పకుండా ఆ ఇంటి వస్తుంది.

శెట్టి ఇంటిలో హార్న్​బిల్​

కృష్ణానంద శెట్టి ఇంటిలో హార్న్‌బిల్‌ను చూడడం నిజంగా చాలా అద్భుతంగా ఉందని స్థానికులు ఆనందపడుతున్నారు. హోన్నకేరి గ్రామంలో చాలా ఇళ్లు ఉన్నా హార్న్‌బిల్ శెట్టి ఇంటికి మాత్రమే వస్తోందని వారు తెలిపారు. శెట్టి కుటుంబం ఆహారం మాత్రమే తీసుకుంటుందని ఆశ్చర్యపడుతున్నారు.

ఆహారం అందిస్తున్న శెట్టి

కుటుంబంతో కలిసి..

ప్రారంభంలో కుటుంబ సభ్యులు అందించే ఆహారాన్ని తీసుకొని ఎగిరిపోయే హార్న్‌బిల్‌.. తర్వాత వారి కుటుంబంలో భాగమైపోయింది. ఆ కుటుంబంలోని పిల్లలతో పాటు కుటుంబ సభ్యులతో కూడా ఆడుకుంటోంది.

శెట్టి కుమారుడితో..

చాలా అరుదైన పక్షి..

పశ్చిమ కనుమ అడవుల్లో మాత్రమే కనిపించే హార్న్‌బిల్‌ పక్షులు.... కర్నాటకలో కనిపించడం చాలా అరుదని స్థానికులు తెలిపారు. భారీ ఆకారంతో విస్తారమైన రెక్కలతో ఈ పక్షి.. విమానాన్ని తలపిస్తుంది.

ఆ కుటుంబంతో హార్న్​బిల్ 'అరుదైన స్నేహం'

ఇదీ చూడండి:'హయగ్రీవ పాయసం' రుచి చూస్తే మైమరచిపోవాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details