తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధానితో దీదీ భేటీ- కారణాలపై ఊహాగానాలు - మమతా

సుదీర్ఘకాలం తరువాత మోదీతో మమతా బెనర్జి సమావేశం కానున్నారు. బంగాల్​ పాలనాంశాలపై చర్చించేందుకు అవకాశం ఉందని బంగాల్​ సచివాలయ వర్గాలు తెలిపాయి. నిత్యం భాజపాపై విమర్శలు చేసే దీదీ.. మోదీని కలవాలనుకోవడం వల్ల ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

మమతా మోదీ

By

Published : Sep 16, 2019, 8:37 PM IST

Updated : Sep 30, 2019, 9:11 PM IST

ప్రధానితో దీదీ భేటీ- కారణాలపై ఊహాగానాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం భేటీకానున్నారు. నిత్యం మోదీపై విమర్శలు చేసే మమత.. స్వయంగా ప్రధానితో సమావేశానికి సమయం కోరడం గమనార్హం.

పలువురు తృణముల్​ కాంగ్రెస్ నేతలు, కోల్​కతా మాజీ పోలీస్​ కమిష​నర్​ రాజీవ్​కుమార్ శారదా కుంభకోణంలో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీదీ-మోదీ ​భేటికి ప్రాధాన్యం సంతరించుకుంది.

చివరిసారిగా 2018లో మే 25వ తేదీన బంగాల్​లోని శాంతినికేతన్​లో జరిగిన విశ్వభారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలో ఇరు నేతలు కలుసుకున్నారు.

'మమతది అవకాశవాద రాజకీయం'

మోదీతో భేటీకానున్న దిదిపై పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. మమత చేస్తున్న అవకాశవాద రాజకీయాలకు ఇది నిదర్శనమని భాజపా జాతీయ కార్యదర్శి రాహుల్​ సిన్హా ఎద్దేవా చేశారు. శారదా కుంభకోణంలో సీబీఐ చర్యల నుంచి తనను, తన పార్టీ నేతలను రక్షించుకునేందుకు.. మోదీని కలిసి ఆ కేసులపై చర్చించేందుకు మమత ప్రయత్నిస్తున్నారని మరో భాజపా నేత ఆరోపించారు.

'మ్యాచ్​ ఫిక్సింగ్ చేస్తున్నారు​'

శారదా కుంభకోణంపై మోదీ-మమత రాజకీయంగా మ్యాచ్​ ఫిక్సింగ్​కు పాల్పడుతున్నారని​ బంగాల్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు సొమెన్​ మిత్రా, సీపీఎం నేతలు విమర్శించారు.

ఇదీ చూడండి: మోదీ జన్మదినాన దేశ ప్రజలకు భాజపా కానుక​

Last Updated : Sep 30, 2019, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details