తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బ్యాలెట్​ పేపర్లకై విపక్ష పార్టీలు డిమాండ్​ చేయాలి' - west bengal

ఎలక్ట్రానికి ఓటింగ్​ మిషన్​ (ఈవీఎం)ల పనితీరుపై మరోమారు విరుచుకుపడ్డారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈవీఎంల పనితీరుపై పూర్తి వివరాల వెల్లడికి నిజ నిర్ధరణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. విపక్ష పార్టీలన్నీ బ్యాలెట్​ పేపర్ల కోసమే డిమాండ్​ చేయాలని పిలుపునిచ్చారు.

'బ్యాలెట్​ పేపర్లకై విపక్ష పార్టీలు డిమాండ్​ చేయాలి'

By

Published : Jun 3, 2019, 8:21 PM IST

లోక్​సభ ఎన్నికల్లో ఎలక్ట్రానికి ఓటింగ్​ యంత్రాలు (ఈవీఎం) వినియోగించటంపై పలు ప్రశ్నలు సంధించారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్​ పేపర్లను తిరిగి తీసుకొచ్చేందుకు విపక్ష పార్టీలన్ని కలిసికట్టుగా డిమాండ్​ చేయాలని పిలుపునిచ్చారు.

ఈవీఎంల పనితీరుపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిజ నిర్ధరణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.

"ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాలి. మనకు మిషన్లు అవసరం లేదు. బ్యాలెట్​ పేపర్ల వ్యవస్థను తిరిగి తీసుకొచ్చేందుకు మనం డిమాండ్​ చేయాలి. మనం ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలి. అది బెంగాల్​ నుంచే ప్రారంభమవుతుంది."

- మమతా బెనర్జీ, బెంగాల్​ ముఖ్యమంత్రి.

దేశంలోని 23 విపక్ష పార్టీలు కలిసికట్టుగా ముందుకొచ్చి బ్యాలెట్​ పేపర్లను తిరిగి తీసుకొచ్చేందుకు డిమాండ్​ చేయాలన్నారు దీదీ. అమెరికా వంటి దేశాలూ ఈవీఎంలను నిషేధించాయని గుర్తుచేశారు.

భాజపాపై విమర్శలు..

భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు దీదీ. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందేందుకు కాషాయ పార్టీ డబ్బు, రాజ్యాంగ వ్యవస్థలు, మీడియాను వినియోగించిందని ఆరోపించారు. రాష్ట్రంలో 42 స్థానాలకు గాను 18 సీట్లను భాజపా గెలుచుకోవడానికి వామపక్షాలే కారణమని మండిపడ్డారు.

ఇదీ చూడిండి: 'ఓట్ల కోసం కూటమి పార్టీలపై ఆధారపడొద్దు'

ABOUT THE AUTHOR

...view details