దసరా వేళ రచయిత్రి అవతారం ఎత్తారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దుర్గా పూజ కోసం 'ఉత్సవ్' పాట రాశారు.
రాష్ట్ర మంత్రి అరూప్ బిస్వాస్ ఆధ్వర్యంలోని సురుచి సంఘ నిర్వహించే దుర్గా మాత పూజ కోసం ఈ భక్తి గీతాన్ని రచించారు మమత. ఈ పాటకు సంగీత దర్శకుడు జీత్ గంగూలీ స్వరాలు సమకూర్చారు. శ్రేయా ఘోషల్ గాత్రాన్ని అందించారు. సెప్టెంబర్ 27న ఈ పాటను విడుదల చేశారు. అక్టోబర్ ఒకటో తేదీన యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. దీనికి సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభిస్తోంది.
"ఈ ఉత్సవాలకు ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నట్లు బంగాలీ సాహిత్యంలో మమత దీదీ దుర్గాదేవి గీతాన్ని రచించారు. ఇదే సందేశాన్ని ఇతివృత్తంగా చేసుకుని కళాకారుడు భబతోష్ సుతార్ సురుచి సంఘ మండపాన్ని రూపొందించారు. సురుచి సంఘ కోసం గత ఐదేళ్లుగా దీదీ గీతాలు రచిస్తున్నారు. దీదీ రచించిన పాటలకు సంగీతాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది."