ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో బంగాల్ పేరు మార్చే అంశంపై చర్చించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చాలని ప్రధానికి విన్నవించారు. ఇంతకుముందే తమ రాష్ట్ర శాసనసభలో పేరుమార్పుపై బిల్లును ఆమోదించామని.. కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోవాలని తన సమావేశంలో పేర్కొన్నట్లు తెలిపారు దీదీ. మోదీతో భేటీ మంచి ఫలితాల్నిచ్చిందన్నారు మమత.
"ప్రధానమంత్రితో సమావేశం బాగా జరిగింది. బంగాల్ పేరును బంగ్లాగా మార్చడంపై బంగాల్ అసెంబ్లీలో బిల్లును ఆమోదించాం. ఈ అంశమై ప్రధానిని కోరాను. ఆయన చర్యలు తీసుకుంటానని తెలిపారు. మా రాష్ట్రంలో ఉన్న బొగ్గు క్షేత్రం ప్రపంచంలోనే రెండో అతి పెద్దది... బిర్హూమ్లో ఉన్న బొగ్గు క్షేత్రం దెబోచా పాచమి. ఈ క్షేత్ర ప్రారంభానికి నవరాత్రి పూజలు పూర్తయిన అనంతరం ప్రధాని సమయం ఇవ్వాలని విన్నవించాను. సమావేశంలో ఇదే రెండో అంశం. ఇద్దరం కలిసి ఈ గని కార్యకలాపాలను ప్రారంభిస్తాం."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి