తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీకి బహిరంగ చర్చకొచ్చే ధైర్యముందా?: దీదీ

బంగాల్ అభివృద్దికి దీదీ అడ్డుపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మమతా బెనర్జీ. మోదీ అబద్ధాలకోరని విమర్శించారు. బంగాల్​ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టామని తెలిపారు. బంగాల్​ రైతుల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని బదులిచ్చారు మమత.

మోదీకి బహిరంగ చర్చకొచ్చే ధైర్యముందా?: దీదీ

By

Published : Apr 3, 2019, 8:43 PM IST

బంగాల్ అభివృద్ధికి మమతా బెనర్జీ అడ్డుపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి. మోదీలా అబద్ధాలు చెప్పడం తనకు రాదన్నారు మమత. తృణమూల్ ప్రభుత్వం హయాంలో బంగాల్ రైతుల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని బదులిచ్చారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు .

బంగాల్​లోని కూచ్ బిహార్​లో తృణమూల్​ కాంగ్రెస్ బహిరంగ సభకు మమత హాజరయ్యారు.ప్రధాని టైం అయిపోయిందని ఎద్దేవా చేశారు . మోదీకి ధైర్యముంటే బెంగాల్ అభివృద్ధి​పై తనతో టీవీలో గానీ, బహిరంగ సభలో చర్చకు రావాలని సవాల్ విసిరారు మమత.

మోదీ పాలనలో దేశంలో 12వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బంగాల్​ సీఎం ఆరోపించారు.

పాక్​ కోసం దీదీ కన్నీరు కార్చారన్న మోదీ విమర్శలపై ఘాటుగా స్పందించారు మమత. తాము జాతీయవాదులమని, నియంతలం కాదని దీటుగా బదులిచ్చారు.

ఇదీ చూడండి:'దీదీ' అభివృద్ధికి స్పీడ్​ బ్రేకర్​ : మోదీ

ABOUT THE AUTHOR

...view details