తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆయన్ను కొట్టేది నేను కాదు... ప్రజాస్వామ్యమే' - DIDI

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చెంపదెబ్బ కొడతానని తానెప్పడూ అనలేదని స్పష్టంచేశారు మమతా బెనర్జీ. ఉదయం పురూలియా సభలో మోదీ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఎన్నికల్లో ఓటమి రూపంలో ప్రజాస్వామ్యమే ప్రధానికి జవాబిస్తుందని అన్నట్లు వివరణ ఇచ్చారు మమత.

'ఆయన్ను కొట్టేది నేను కాదు... ప్రజాస్వామ్యమే'

By

Published : May 9, 2019, 4:30 PM IST

తనను దీదీ చెంపదెబ్బ కొడతానని అన్నారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ. ప్రధానిని తానెప్పుడూ అలా అనలేదని స్పష్టం చేశారు.

బంగాల్​ పురూలియా జిల్లా సిములియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మమత. మోదీ చెంపదెబ్బ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

'ప్రజాస్వామ్యమే మోదీ చెంప చెళ్లుమనిపిస్తుందని అంటే దాని అర్థం ప్రజలు ఎన్నికల్లో ఓట్ల ద్వారా బుద్ధి చెబుతారని. నేను చెంపదెబ్బ కొడతానని కాదు. ప్రధానిని నేనెందుకు కొడతా? భాషను ఆయన అర్థం చేసుకోవాలి' అని సభలో మమత అన్నారు.

దీదీ చెంపెదెబ్బలైనా తనకు ఆశీర్వాదాలేనని ఉదయం పురూలియా ఎన్నికల సభలో అన్నారు మోదీ.

ఇదీ చూడండి: మీ చెంప దెబ్బలైనా నాకు ఆశీర్వాదాలే: మోదీ

ABOUT THE AUTHOR

...view details