తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా లక్ష్యంగా మరోసారి మమతా విమర్శలు - west bengal

పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భాజపా లక్ష్యంగా మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. అసోం తరహాలో బంగాల్‌లోనూ జాతీయ పౌర రిజిస్టార్‌- ఎన్​ఆర్​సీ చేపడతామని భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్​ఆర్​సీ భయాందోళనలతో బంగాల్‌లో ఇప్పటివరకూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.

భాజపా లక్ష్యంగా మరోసారి విమర్శించిన మమతా

By

Published : Sep 23, 2019, 10:41 PM IST

Updated : Oct 1, 2019, 6:31 PM IST

భాజపాపై మరోసారి విమర్శలు గుప్పించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జాతీయ పౌర రిజిస్టార్​ ప్రవేశపెడతామన్న కమలం పార్టీ తప్పుడు ప్రచారాలతో ఆరుగురు బలయ్యారని వెల్లడించారు. బంగాల్​లో ఎన్​ఆర్​సీని నిర్వహించబోమని పేర్కొన్నారు.

కోల్‌కతాలో కార్మిక సంఘాలతో సమావేశమైన మమతా.. బంగాల్‌లో ఎన్​ఆర్​సీని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోనని స్పష్టం చేశారు. బంగాల్‌తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ దీనిని నిర్వహించబోరని పేర్కొన్నారు.

చాలా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు మమతా. దేశంలో యువత ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనంపై భాజపా దృష్టిపెట్టడం లేదని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని విమర్శించారు.

ఇదీ చూడిండి : ఆర్థిక సంక్షోభంతో 178 ఏళ్ల నాటి కంపెనీ దివాలా!

Last Updated : Oct 1, 2019, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details