తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర వరదలు: నీట మునిగిన కొల్హాపుర్​

మహారాష్ట్రలో జల ప్రళయం కొనసాగుతోంది. ముంబయి పరిసర ప్రాంతాలతో పాటు నాసిక్​, కొల్హాపుర్​ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

మహారాష్ట్ర వరదలు

By

Published : Aug 7, 2019, 1:46 PM IST

Updated : Aug 7, 2019, 2:25 PM IST

మహారాష్ట్రలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముంబయిలో వానల బీభత్సం కొనసాగుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. వర్షాల ధాటికి గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

కొల్హాపుర్​లో...

కొల్హాపుర్​లో భారీ ఎత్తున వరద నీరు చేరింది. పట్టణం నుంచి వెళ్లే పుణె-బెంగళూరు హైవే మొత్తంగా నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో సహాయక చర్యలను ముమ్మరం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.

నీట మునిగిన కొల్హాపుర్​

గోవా కోస్ట్​గార్డ్స్​కు చెందిన 22 మంది బృందంతో ఓ హెలికాప్టర్ రంగంలోకి దిగింది. వరద బాధితులకు పడవల ద్వారా ఎన్డీఆర్​ఎఫ్, సైన్యం సాయం అందిస్తున్నాయి. 204 వరద ప్రభావిత గ్రామాల్లోని 11,432 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు సిబ్బంది.

కేబినెట్​ భేటీ

రాష్ట్రంలో వరదలపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ నేతృత్వంలో కేబినెట్​ భేటీ నిర్వహించారు. పునరావాస చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆల్​మట్టి ఆనకట్ట నుంచి నీటిని దిగువకు విడుదల చేయాలని కర్ణాటక సీఎం యెడియూరప్పను కోరారు ఫడణవీస్​.

ఇదీ చూడండి: 'వెంకయ్య, సుష్మల అన్నాచెల్లెల అనుబంధం'​

Last Updated : Aug 7, 2019, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details