ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్కు లేఖ రాశారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ విధానాలు పాతాళానికి పడిపోయినట్లే భావించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు పవార్.
ముంబయి ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరి మహాత్మా గాంధీపై ట్విట్టర్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. తీవ్ర నిరసనలు వెల్లువెత్తగా... చివరకు క్షమాణలు చెప్పారు.