తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధురై మీనాక్షి పట్టాభిషేకంలో మహాత్ముడు! - మధురై

మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోని పట్టాభిషేకం పెయింటింగ్​ చూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే పురాతనమైన ఈ చిత్రంలో మహాత్మ గాంధీ ఉండటమే.

మధురై మీనాక్షి పట్టాభిషేకంలో మహాత్ముడు!

By

Published : Aug 18, 2019, 5:28 AM IST

Updated : Sep 27, 2019, 8:45 AM IST

మధురై మీనాక్షి పట్టాభిషేకంలో మహాత్ముడు!

తమిళనాడు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ ఓ అరుదైన దృశ్యం సందర్శకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆలయంలోని అష్ట శక్తి మందిరంలో మీనాక్షి పట్టాభిషేకం పెయింటింగ్​ ఉంటుంది. ఈ చిత్రంలో కళ్లద్దాలు పెట్టుకుని కార్యక్రమాన్ని తిలకిస్తున్న మహాత్మగాంధీ కనిపిస్తారు.

ఇదీ చూడండి:- మహాత్ముడు మెచ్చిన పల్లె... ఎందుకంత ప్రత్యేకం?

మీనాక్షి అమ్మవారి పట్టాభిషేకం పెయింటింగ్​లో బాపూజీ ఉండడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఆలయంలోని పాత పెయింటింగ్స్​కు 1885లో మరమ్మతులు చేశారు. 1923లో ఈ చిత్రాలకు కొత్త రంగులు వేయాలని నిర్ణయించారు. ఆ సమయంలో గాంధీ స్వాతంత్ర్యోద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కృషికి గౌరవ సూచకంగా పెయింటింగ్​లో అమ్మవారి పట్టాభిషేకం తిలకిస్తున్నవారితో పాటు మహాత్ముడిని జోడించారు.

మధురై మీనాక్షి పట్టాభిషేకం

మధురై మీనాక్షికి జరిపే అతిపెద్ద ఉత్సవం పట్టాభిషేకమే. మధురై రాజు భగవాన్​ సుందరేశ్వరార్​ నుంచి మీనాక్షి దేవి చితిరై నెలలో బాధ్యతలు స్వీకరించి అవని నెల వరకు ఆ ప్రాంతాన్ని పాలిస్తారు. ఈ కారణంగా ఏడాదికి రెండు సార్లు అవని, చితిరై నెలల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

ఇదీ చూడండి- గాంధీ-150: అక్షర సైనికుడిగా మహాత్ముడి ముద్ర

Last Updated : Sep 27, 2019, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details