మహారాష్ట్రలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌సింగ్ డిసలేకు అరుదైన గౌరవం దక్కింది. గ్లోబల్ టీచర్స్ ప్రైజ్‌మనీకి ఎంపిక చేసే తుది 10మంది జాబితాలో ఆయన స్థానం సంపాదించారు. ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన అద్వితీయ కృషికి గానూ ఈ గుర్తింపు పొందారు. ఒకవేళ ఆయన గెలిస్తే బహుమతిగా మిలియన్ డాలర్లను గెలుపొందుతారు.
ప్రపంచంలోని నలుమూలలా విద్యార్థుల భవిష్యత్తును గొప్పగా తీర్చుదిద్దుతున్న ఉపాధ్యాయులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు యునెస్కో భాగస్వామ్యంతో గ్లోబల్ టీచర్స్ ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. విజేతలకు మిలియన్ డాలర్లను బహుమతిగా అందిస్తోంది.
ఆదర్శ ఉపాధ్యాయుడు..
సోలాపుర్ జిల్లా పరిటేవాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 2009లో ఉపాధ్యాయుడిగా వెళ్లారు రంజిత్‌సింగ్. ఆ సమయంలో పశువుల పాక, స్టోర్‌రూమ్‌కు మధ్య ఉన్న పాఠశాల భవనం శిథిలావస్తలో ఉంది. ఆయన అక్కడ విధుల చేపట్టాక పాఠశాలు రూపురేఖలే మారిపోయాయి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను స్థానిక భాషలోకి అనువాదం చేసి వారికి పాఠాలు బాగా అర్థమయ్యేలా చేశారు. పుస్తకాలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా విద్యార్థులు ఆడియో కవితలు, వీడియో పాఠాలు, కథలు, అసైన్మెంట్లు పూర్తి చేసేందుకు సులభమైంది.