తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో మరో మంత్రికి కరోనా - కొవిడ్​ లేటెస్ట్​ న్యూస్​

మహారాష్ట్రలో కరోనా కేసులు లక్షకు చేరువయ్యాయి. రాష్ట్రంలో మంత్రులూ వరుసగా కరోనా బారినపడుతున్నారు. సామాజిక న్యాయశాఖ మంత్రి ధనంజయ్​ ముండేకు తాజాగా కరోనా సోకింది.

Maharashtra social justice minister dhananjay munde Found corona Positive
ఆ రాష్ట్రంలో మరో మంత్రికి కరోనా

By

Published : Jun 12, 2020, 11:01 AM IST

అంతకంతకూ విస్తరిస్తోన్న కొవిడ్​ మహమ్మారి ఎవ్వరినీ వదలట్లేదు. దేశంలో వైరస్​ వ్యాప్తి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో మంత్రులు వరుసగా కరోనా బాధితులుగా మారుతున్నారు. రాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి ధనంజయ్​ ముండేకు తాజాగా కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదివరకే మంత్రులు జితేంద్ర, అశోక్​ చవాన్​లకు కరోనా సోకింది. అయితే.. వీరిరువురూ కోలుకున్నారు. బాధిత మంత్రుల్లో ధనంజయ్​ మూడో వ్యక్తి. ఆయన వ్యక్తిగత సహాయకుడు సహా ఇతర సిబ్బందికీ వైరస్​ సోకినట్లు సమాచారం.

మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్​ సమావేశంలో పాల్గొన్నారు ముండే. దీంతో అప్రమత్తమైన అధికారులు.. బాధితుల్ని గుర్తించే పనిలోపడ్డారు.

లక్షకు చేరువలో..

మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా ఉంది. కేసులు లక్షకు చేరువయ్యాయి. గడచిన 24 గంటల్లో 3607 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 152 మంది ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

...view details