తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2020, 1:34 PM IST

ETV Bharat / bharat

ఇది కరోనా కాలం.. బాధ్యత ఉండక్కర్లేదా?

కరోనా వైరస్ దేశంలో క్రమంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో నియంత్రణ దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. దేశంలోనే వైరస్ కేసుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్రలో కూడా సెలవులు ఇచ్చారు. అయితే వైరస్​ వ్యాప్తి నిరోధానికి ఇంట్లో ఉండటానికి బదులుగా ముంబయి పౌరులు క్రికెట్, వాకింగ్​ల పేరుతో బయటతిరుగుతూ ప్రమాదం మరింత పెరిగేలా వ్యవహరిస్తున్నారు. ముంబయి వాసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

mumbai
ముంబై

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటికే 270కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటించి మహమ్మారి మరింతమందికి అంటుకోకుండా చర్యలు చేపడుతున్నాయి. దేశంలోనే అత్యంత ఎక్కువగా మహారాష్ట్రలో 63 కేసులు నమోదైన నేపథ్యంలో అక్కడకూడా సెలవులు ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే వైరస్​పై జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో ఉండాల్సింది పోయి.. యథేచ్చగా సంచరిస్తున్నారు అక్కడి పౌరులు. క్రికెట్ మ్యాచులు, వాకింగ్​లతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశాలను పెంచుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అత్యంత ముఖ్యమైనది ఇతరులతో అవసరమైన మేరకు దూరంగా ఉండటం. ఈ అంశాన్ని విస్మరించకూడదని వైద్యులు పదేపదే సూచిస్తున్నారు. అన్ని వైరస్​ల మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదని ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తేనే వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు వైరస్ తీవ్రతను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ముంబై వాసుల నిర్లక్ష్య వైఖరి

ఇదీ చూడండి:బ్రెడ్​ వ్యాపారి సైకిల్​పై మోదీ 'జనతా' స్వరం!

ABOUT THE AUTHOR

...view details