మహారాష్ట్రలో మరోసారి భూమి కంపించింది. పాల్ఘర్ ప్రాంతంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించగా.. రిక్టర్ స్కేలుపై 3.5గా తీవ్రత నమోదైంది. అయితే ఈ ఘటనతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.
పాల్ఘర్ జిల్లా, డహను తాలుకా, పారస్వది ప్రాంతంలో ఉదయం 8.07 గంటలకు స్వల్ప స్థాయిలో భూమి కంపించిందని జిల్లా విపత్తు నియంత్రణ అధికారి తెలిపారు.