తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' పంపకం: సేనకు హోం, ఎన్సీపీకి ఆర్థిక శాఖ - portfolio maharashtra ministers

మహారాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన రెండు వారాల తర్వాత శాఖల కేటాయింపు పూర్తయింది. శివసేనకు కీలక హోంశాఖ, ఎన్సీపీకి ఆర్థిక శాఖ, కాంగ్రెస్​కు రెవెన్యూ శాఖ దక్కాయి.

maharashtra-govt-portfolios
'మహా' పంపకం: సేనకు హోం, ఎన్సీపీకి ఆర్థిక శాఖ

By

Published : Dec 12, 2019, 6:33 PM IST

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు వారాల తర్వాత మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. కీలకమైన హోంశాఖను శివసేన నేత ఏక్​నాథ్​​ శిందేకు అప్పగించారు. ఆర్థిక శాఖను ఎన్సీపీ నేత జయంత్ పాటిల్​కు, రెవెన్యూ శాఖను కాంగ్రెస్​ నేత బాలాసాహెబ్​ థోరట్​కు కేటాయించారు.

శాఖల కేటాయింపు

శివసేన: హోం, పట్టణాభివృద్ధి, పర్యావరణ, పర్యటకం, పార్లమెంటరీ వ్యవహారాలు, సాంకేతిక ఉన్నత విద్య, క్రీడల శాఖలు.

ఎన్సీపీ: ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, జల వనరులు, గృహనిర్మాణం, ఆహార సరఫరా, కార్మిక శాఖలు.

కాంగ్రెస్​: రెవెన్యూ, పాఠశాల విద్య, పశు సంవర్థక, మత్స్య శాఖలు

ఇదీ చూడండి: 'పౌర' ఆగ్రహం: ఈశాన్యంలో నిరసనలు హింసాత్మకం

ABOUT THE AUTHOR

...view details