దేశంలో గత నెల రోజుల్లో లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తూ వస్తున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి వేగం మాత్రం పెరగడంలేదని చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ (ఐఎంఎస్సీ) అధ్యయనంలో తేలింది. వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి అది సంక్రమించే వేగం క్రమంగా తగ్గుతూ వస్తోంది.
తొలి లాక్‌డౌన్ ప్రారంభానికి ముందు రోజైన మార్చి 24న ఐఎంఎస్సీ శాస్త్రవేత్తల గణాంకాల ప్రకారం...వైరస్ ఒక వ్యక్తి నుంచి 1.83 మందికి సోకినట్లు తేలింది. అంటే వంద మంది వ్యక్తుల ద్వారా అది 183 మందికి సంక్రమించే అవకాశం ఉన్నట్లు లెక్క. లాక్‌డౌన్ ఆంక్షలు క్రమంగా సడలించుకొంటూ వచ్చిన తర్వాత వైరస్ వ్యాప్తి తొలుత 1.49కి, ఆ తర్వాత 1.29కి, తాజా గణాంకాల ప్రకారం ఒకరి నుంచి 1.22 మందికి మాత్రమే వైరస్ వ్యాపిస్తోంది.
అంటే 100 మంది వ్యక్తుల ద్వారా 122 మందికి ఇది సంక్రమిస్తోందని అర్థం. లాక్‌డౌన్ విధించిన తొలినాళ్ల నుంచి ఇప్పటికి దాదాపు 61 మందికి సక్రమణం తగ్గినట్టు ఈ అధ్యయనం చెబుతోంది. ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో ప్రజలు బయటికి రావడం మొదలైన తర్వాత కూడా వైరస్ వ్యాప్తి వేగంలో తగ్గుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
ఆ రాష్ట్రాల్లో ఆందోళనకరం