కరోనా కేసుల సంఖ్యలో దేశంలోనే తొలిస్థానంలో ఉన్న మహారాష్ట్రలో మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3 వేల మందికిపైగా కరోనా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 50 వేలు దాటింది.
'మహా' విజృంభణ: 50 వేలు దాటిన కరోనా కేసులు - corona virus latest news
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 3,041 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటింది.
'మహా' విజృంభణ: 50 వేలు దాటిన కరోనా కేసులు
రాష్ట్రంలో కొవిడ్-19పై తాజా బులిటెన్ విడుదల చేసింది రాష్ట్ర ఆరోగ్య శాఖ. 24 గంటల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది. కొత్తగా 3,041 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 50,231కి చేరింది. ఒక్క రోజులోనే 1,196 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు ఇలా..
కేసుల వివరాలు | సంఖ్య |
మొత్తం కేసులు | 50,231 |
మొత్తం మరణాలు | 1,635 |
యాక్టివ్ కేసులు | 33,988 |
కోలుకున్నవారు | 1,4600 |