తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో భాజపానే.. పోటీనిస్తున్న కాంగ్రెస్​-ఎన్సీపీ - మహారాష్ట్ర విధానసభ ఎన్నికల ఫలితాలు-2019

రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాషాయ పార్టీ జోరు కొనసాగిస్తోంది. మహారాష్ట్రలో మూడింట రెండొంతుల స్థానాలు గెలుస్తుందన్న ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు తప్పేలా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్​-ఎన్సీపీలు గట్టి పోటీనిస్తున్నాయి. కమలదళం గతం కంటే తక్కువ సీట్లకే పరిమితమయ్యే అవకాశముంది.

మహారాష్ట్రలో భాజపానే.. పోటీనిస్తున్న కాంగ్రెస్​-ఎన్సీపీ

By

Published : Oct 24, 2019, 12:56 PM IST

మహారాష్ట్రలో ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. అధికార కూటమి సాధారణ మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. భాజపా క్రితం సాధించిన సీట్ల కంటే కాస్త వెనుకంజలోనే ఉన్నప్పటికీ తొలి స్థానంలోనే ఉంది. 2014 ఎన్నికల్లో 63 స్థానాలు నెగ్గిన శివసేన ఈ సారి ఆ సంఖ్యను పెంచుకునేలా కనిపిస్తోంది.

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తప్పని రుజువు చేసేలా ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్​-ఎన్సీపీ సర్వే సంస్థల అంచనాలకు మించి రాణిస్తున్నాయి. కాంగ్రెస్​ కంటే ఎన్సీపీ కాస్త పైనే ఉండటం విశేషం.

వ్యూహాత్మకంగా సేన...

భాజపా-శివసేన కూటమి కలిసే మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే... ఈ నేపథ్యంలో శివసేన కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలనే ప్రతిపాదన భాజపా ముందు పెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది.

ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖులు ముందంజలో ఉన్నారు. భాజపా సీఎం అభ్యర్థి ఫడణవీస్​, ఎన్సీపీ నేత అశోక్​ చవాన్​, శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఇంకా పలువురు ముఖ్యులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 122, శివసేన 63 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్​ 42, ఎన్సీపీ 41 చోట్ల నెగ్గాయి. భాజపా-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

ABOUT THE AUTHOR

...view details