వరద బీభత్సం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక క్రమంగా కోలుకుంటున్నాయి. వారం రోజులుగా మూతపడి ఉన్న ముంబయి-బెంగళూరు జాతీయ రహదారిపై పాక్షికంగా రాకపోకలు మొదలయ్యాయి.
కొల్హాపుర్ జిల్లాలో వరదలు తగ్గుముఖం పట్టాయి. షిరోలి వంతెనపై ఒకవైపు నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. భారీ వర్షాలకు కొల్హాపుర్, సంగ్లీ జిల్లాలు వారం రోజుల పాటు వరద గుప్పిట చిక్కాయి. కొంకణ్, పశ్చిమ ప్రాంతాల్లో వర్షాల ధాటికి మహారాష్ట్రలో 40 మంది మృతి చెందారు.
కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం ద్వారా 5 లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేయటం వల్ల మహారాష్ట్ర పశ్చిమ జిల్లాల్లో వరదలు తగ్గాయి.