తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి.. లేదంటే అరెస్టే! - lockdown

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని ప్రకటించింది బృహణ్ ముంబయి కార్పొరేషన్. మాస్కు లేకుండా సంచరిస్తే కేసులు తప్పవని హెచ్చరించింది. ఉత్తర్​ప్రదేశ్​లో వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మూసివేత అమలు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.

masks
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి.. లేదంటే అరెస్టే!

By

Published : Apr 8, 2020, 6:04 PM IST

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది బృహణ్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. మాస్కు లేకుండా సంచరిస్తే కేసులు తప్పవని హెచ్చరించింది.

"ఏ అవసరం కోసమైనా సరే.. బహిరంగ ప్రదేశాల్లో సంచరించే ప్రతి ఒక్కరు మాస్కు ధరించాల్సిందే. వీధులు, ఆస్పత్రులు, కార్యాలయాలు, మార్కెట్లలో మాస్కు లేదా చేతి రుమాలు ధరించాల్సిందే."

-బృహణ్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటన

యూపీలో 15 ప్రాంతాలు మూసివేత

ఉత్తర్​ప్రదేశ్​లో వైరస్ కట్టడికి చర్యలు చేపట్టింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. 15 జిల్లాల్లోని వైరస్ ప్రభావిత ప్రాంతాల మూసివేతకు ఆదేశించింది. ఏప్రిల్ 15వరకు ఈ మూసివేత వర్తిస్తుందని స్పష్టం చేసింది.

"కరోనా వైరస్ వల్ల ప్రభావితమైన 15 జిల్లాల్లోని ఆయా ప్రాంతాలను ఏప్రిల్ 15 వరకు మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. కేవలం నిత్యావసర వస్తువులను హోం డెలివరీకి మాత్రమే అనుమతిస్తున్నాం. ఈ ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువగా నమోదైన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అంబులెన్స్ వంటి అత్యావసర వాహనాలు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తాం."

-యూపీ ప్రభుత్వం

ఇదీ చూడండి:కరోనా కట్టడిలో 'కేరళ మోడల్​' సూపర్ ​హిట్​!

ABOUT THE AUTHOR

...view details