తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శునకాలను చంపి.. రోడ్లపై కుప్పలుగా విసిరేశారు

మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో రహదారిపై నోరు, కాళ్లను తాళ్లతో కట్టేసి ఉన్న 90 శునకాల మృతదేహాలను స్థానిక పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

శునకాలను చంపి.. రోడ్లపై కుప్పలుగా విసిరేశారు

By

Published : Sep 9, 2019, 7:11 AM IST

Updated : Sep 29, 2019, 10:59 PM IST

శునకాలను చంపి.. రోడ్లపై కుప్పలుగా విసిరేశారు

మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో గుంపులుగా పడి ఉన్న శునకాల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. అటవీ ప్రాంతంలో దాదాపు 90 శునకాల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. విపరీతమైన దుర్వాసన రావడం వల్ల ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

100కు పైగా కుక్కలను రోడ్డుపై 5చోట్ల విసిరేసినట్లు గుర్తించిన పోలీసులు. వాటిలో 90 శునకాలు చనిపోయినట్లు తెలిపారు. పట్టణ శివార్ల నుంచి శునకాలను తెచ్చి.. వాటిని చంపి అడవిలో విసిరేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై జంతువుల పట్ల క్రూరప్రవర్తన చట్టం 1960, ఇండియన్ పీనల్​ కోడ్​ల కింద కేసు నమోదు చూసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కుక్కలను ఎవరు.. ఎందుకు చంపారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి: భర్త ఎదుటే భార్యా-పిల్లల సజీవ దహనం

Last Updated : Sep 29, 2019, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details