ఉపఎన్నికల తర్వాత...
అసెంబ్లీలోని ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిపిన తర్వాతే విశ్వాస పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. దీనిని భాజపా ఖండించింది. ఎట్టిపరిస్థితుల్లోనైనా బలపరీక్ష వెంటనే నిర్వహించాలని తెలిపింది.
13:23 March 18
ఉపఎన్నికల తర్వాత...
అసెంబ్లీలోని ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిపిన తర్వాతే విశ్వాస పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. దీనిని భాజపా ఖండించింది. ఎట్టిపరిస్థితుల్లోనైనా బలపరీక్ష వెంటనే నిర్వహించాలని తెలిపింది.
12:18 March 18
గవర్నర్ వద్దకు...
ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ లాల్జీ టాండన్‌ను కాంగ్రెస్ నేతల బృందం కలవనుంది. రాష్ట్ర రాజకీయాల్లోని తాజా పరిణామాలపై చర్చించే అవకాశముంది.
12:04 March 18
కాంగ్రెస్ సమాధానం
శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానాన్ని.. న్యాయవాది దుశ్యంత్ దేవ్ వినిపిస్తున్నారు. ప్రజల నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తోందని తెలిపారు. కానీ ఇప్పుడు భాజపా.. తన బలాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
11:57 March 18
సింధియా తిరుగుబాటుతో...
మధ్యప్రదేశ్‌లో కీలక నేత జోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఆయన మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులను వదులుకోవటం వల్ల సంక్షోభం నెలకొంది. వీరంతా భాజపాలో చేరతారని అందరు అనుకున్నప్పటికీ.. సింధియా ఒక్కరే కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బలపరీక్షపై సందిగ్ధత నెలకొంది.
బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో ఉన్న 22 మంది ఎమ్మెల్యేల్లో కొందరు భాజపాలో చేరేందుకు సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటించారు. తిరిగి పార్టీలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. ఆరుగురి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు.
11:38 March 18
సుప్రీం విచారణ
మధ్యప్రదేశ్ రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. కమల్‌నాథ్ ప్రభుత్వానికి వెంటనే బలపరీక్ష నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయాలన్న వ్యాజ్యంపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌ను భాజపా సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ దాఖలు చేశారు.
స్పీకర్ నిర్ణయంతో..
గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశాల మేరకు.. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సోమవారమే బలపరీక్ష జరగాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా సభను ఈ నెల 26 వరకు వాయిదా వేశారు స్పీకర్ ప్రజాపతి.
స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు భాజపా సీనియర్ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్. వెంటనే బలపరీక్ష నిర్వహించే విధంగా కమల్‌నాథ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై స్పందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది కోర్టు. బుధవారం ఉదయం 10:30 గంటల లోపు కమల్‌నాథ్ ప్రభుత్వం.. సర్వోన్నత న్యాయస్థానానికి వివరణ ఇవ్వాల్సి ఉంది.