మధ్యప్రదేశ్ రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించారు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్. దిల్లీలో భాజపా అధినాయకత్వంతో సంప్రదించిన ఆయన... కొత్తగా 28 మందికి తన మంత్రి వర్గంలో చోటుకల్పించారు.
జ్యోతిరాధిత్య సింధియా వర్గం తిరుగుబాటుతో కాంగ్రెస్ నేతృత్వంలోని కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలగా.. భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భాజపాలో చేరిన సింధియా అనుచరులకు మంత్రి వర్గంలో ప్రాధాన్యం ఇచ్చారు శివరాజ్‌సింగ్ చౌహాన్. అలాగే 12 మంది భాజపా వినయవిధేయులకు మంత్రులుగా అవకాశం కల్పించారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం..
భాజపా నేతలు గోపాల్ భార్గవ, యశోధర రాజే సింధియా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఇమర్తి దేవి, ప్రభురామ్ చౌదరి, ప్రద్యుమాన్ సింగ్ తోమర్ మంత్రులుగా ప్రమాణం చేశారు.