తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గిరిజనులపై వ్యాఖ్యలు ప్రసంగ ఉరవడిలో చేసినవే'

జాతీయ గిరిజనుల కమిషన్​ ఇచ్చిన నోటీసుపై వివరణ ఇచ్చారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. 'గిరిజనుల్ని కాల్చి వేసేందుకు కొత్త చట్టం తెచ్చారు' అంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ఒక రాజకీయ ప్రసంగ ఉరవడిలో భాగంగా చేసినవేనని పేర్కొన్నారు.

'గిరిజనులపై వ్యాఖ్యలు ప్రసంగ ఉరవడిలో చేసినవే'

By

Published : Jun 21, 2019, 6:50 AM IST

'గిరిజనుల్ని కాల్చి వేసేందుకు కొత్త చట్టం తెచ్చారు' అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. జాతీయ గిరిజనుల కమిషన్​ జారీ చేసిన నోటీసులకు సమాధానంగా.. "ఆ వ్యాఖ్యలురాజకీయ ప్రసంగ ఉరవడిలో చేశాను" అని స్పష్టం చేశారు రాహుల్.

మధ్యప్రదేశ్​లోని షాడోల్​లోఏప్రిల్​ 23న జరిగిన సభలో రాహుల్​ మాట్లాడుతూ.. 'మోదీ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో గిరిజనుల్ని కాల్చివేయొచ్చని వ్యాఖ్యం ఉంది. వాళ్లు మీ భూమిని లాక్కొంటారు. చివరికి గిరిజనుల్ని కాల్చివేయొచ్చని చెబుతారు' అని పేర్కొన్నారు.

మీడియాలో వచ్చిన కథనాల మేరకు మే 3న కాంగ్రెస్​ అధ్యక్షుడికి నోటీసులు జారీ చేసిందిఎన్​సీఎస్​టీ.

ఇదీ చూడండి:పార్లమెంట్​లో 10 ఆర్డినెన్స్​లను ప్రవేశపెట్టిన కేంద్రం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details