దేశంలో జరుగుతున్న ముకదాడులు నిరోధించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వాలు విస్మరించాయంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు విచారించిన న్యాయస్థానం సమాధానం ఇవ్వాలంటూ కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
మూకదాడులపై భారత అవినీతి వ్యతిరేక మండలి ట్రస్ట్ వేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.