తెలంగాణ

telangana

ETV Bharat / bharat

28వ సైన్యాధ్యక్షుడిగా జనరల్ ముకుంద్ నరవాణే

లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే 28వ సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. డిసెంబర్ 31న బిపిన్ రావత్ పదవీ విరమణ చేసిన అనంతరం ఆ బాధ్యతలను మనోజ్​ చేపట్టనున్నారు.

naravane
28వ సైన్యాధ్యక్షుడిగా జనరల్ ముకుంద్ నరవాణే

By

Published : Dec 16, 2019, 10:28 PM IST

లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే భారత 28వ సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం 13 లక్షల సైన్యం ఉన్న భారత ఆర్మీకి నరవాణే నేడు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన భారత సైన్యం తూర్పు విభాగానికి అధిపతిగా వ్యవహరించారు.

సీనియారిటీ ప్రకారం నరవాణేను సైన్యాధ్యక్ష పదవికి ఎంపిక చేసింది ప్రభుత్వం. ప్రస్తుత సైన్యాధిపతి బిపిన్ రావత్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు రావత్. పదవీ విరమణ అనంతరం రక్షణ దళాల ప్రధాన అధికారిగా రావత్ బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం.

నరవాణే నేపథ్యం

‘1980లో సిక్కు లైట్ ఇన్​ఫ్ంట్రీలో సైన్యంలో చేరిన నరవాణే ఆపరేషన్‌ పవన్‌ సమయంలో శ్రీలంకకు పంపిన శాంతి దళంలో కీలకంగా వ్యవహరించారు. జమ్ముకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టిన అనేక ఉగ్రవాద నిరోధక చర్యల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కశ్మీర్‌లో ఆయన సేవల్ని గుర్తించిన ప్రభుత్వం.. సేనా మెడల్‌, అసోం రైఫిల్స్‌లో కీలకంగా వ్యవహరించినందుకుగానూ విశిష్ఠ సేవా మెడల్‌తో సత్కరించింది. మయన్మార్​లోని భారత రాయబార కార్యాలయంలో భారత రక్షణ దళ ప్రతినిధిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇదీ చూడండి: ఛాతీలోకి ఇనుప కడ్డీ దూసుకెళ్లినా.. బతికిపోయాడు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details