రైల్వే శాఖకు నిధుల కేటాయింపు డిమాండ్లపై లోక్‌సభలో జరిగిన చర్చ అర్ధరాత్రి వరకు కొనసాగింది. రాత్రి 11.58 నిమిషాల వరకు సభ నడిచింది. సభ్యులు ఇంత సుదీర్ఘ సమయం పాటు సభలో కూర్చోవడం 18 ఏళ్లలో ఇదే మొదటిసారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన చర్చలో దాదాపు 100 మంది సభ్యులు పాల్గొన్నారు. సేవలపై మోదీ సర్కారు దృష్టి పెట్టలేదని, రైల్వే ఆస్తులను అమ్మేసేందుకు ప్రయత్నిస్తోందని చర్చలో భాగంగా విపక్షాలు ఆరోపించాయి.